మోదీ జన్మదినం సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం దేవునిపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ దేశ సేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాద దీపం వెలిగించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ...