NIGAMA MEDIA (P) LTD
15.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, August 24, 2026

ఆటో కార్మికుల సమ్మెకు సీపీఐ(ఏఎం) సంపూర్ణ మద్దతు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): 

ఆటో యూనియన్‌ ఓనర్లు, డ్రైవర్లు తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24 నుంచి చేపట్టనున్న సమ్మెకు సీపీఐ(ఏఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమగూడెం ఎక్స్‌ రోడ్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ(ఏఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి పాల్గొని కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా సమ్మెకు మద్దతు ప్రకటించిన సంకె రవికి మంచిర్యాల జిల్లా జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ అధ్యక్షుడు కట్ట రామ్‌కుమార్, సెక్రటరీ దూడం రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు దుర్గం రామారావు, బండారి వీరయ్య, దుర్గం రమేష్, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంకె రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ఆటో, ట్రాలీ, స్కూల్ బస్సులు, ఇతర వాహనాలను నడుపుకుంటూ చాలీచాలని ఆదాయాలతో జీవిస్తున్న కార్మికుల వృత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న పోరాటానికి సీపీఐ(ఏఎం) పూర్తి మద్దతు ఇస్తుందని సంకె రవి స్పష్టం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.