ఆటో కార్మికుల సమ్మెకు సీపీఐ(ఏఎం) సంపూర్ణ మద్దతు
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): ఆటో యూనియన్ ఓనర్లు, డ్రైవర్లు తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24 నుంచి చేపట్టనున్న సమ్మెకు సీపీఐ(ఏఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమగూడెం ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ(ఏఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి పాల్గొని కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మెకు మద్దతు ప్రకటించిన సంకె రవికి మంచిర్యాల జిల్లా జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ అధ్యక్షుడు కట్ట రామ్‌కుమార్, సెక్రటరీ దూడం రాజు ఆధ్వర్యంలో జరిగిన...