NIGAMA MEDIA (P) LTD
15.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, August 24, 2026

ఆటో డ్రైవర్ల బందుకు ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ సంపూర్ణ మద్దతు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): 

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్లు చేపట్టనున్న బంద్‌కు ఎంసీపీఐయూ, అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీయూ) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటో వృత్తినే ప్రధాన జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు.

ఆటో డ్రైవర్లు చేపడుతున్న సమ్మె న్యాయమైనదని పేర్కొన్న పసులేటి వెంకటేష్, వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐయూ పార్టీ, ఏఐసీటీయూ ఆధ్వర్యంలోని కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు.

ప్రధాన డిమాండ్లు

  1. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.
  2. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందజేయాలి.
  3. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
  4. ఆటో కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లతో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
  5. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత సేవల వల్ల ఆటో కార్మికుల ఉపాధికి నష్టం జరుగుతోందని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
  6. ఆటో డ్రైవర్లకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి.
  7. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక ఆటో స్టాండ్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం గుర్తించి తక్షణమే పరిష్కరించాలని పసులేటి వెంకటేష్ కోరారు. ఆటో డ్రైవర్ల బంద్‌కు ఎంసీపీఐయూ పార్టీ, కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి మద్దతు ఇస్తాయని ఆయన తెలిపారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.