22.2 C
Munich
Friday, August 7, 2026

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ విక్రయాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

జులైలో 1.30 కోట్ల లడ్డూల విక్రయం
గత రెండేళ్లతో పోలిస్తే అత్యధిక అమ్మకాలు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకు భక్తుల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు ప్రతి నెలా లడ్డూ విక్రయాలు క్రమంగా పెరుగుతూ కొత్త రికార్డులను నమోదు చేశాయి. దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నెలలో 1.11 కోట్ల, మేలో 1.21 కోట్ల, జూన్‌లో 1.26 కోట్ల, జులైలో అత్యధికంగా 1.30 కోట్ల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయించింది.

గత సంవత్సరాలతో పోల్చితే కూడా ఈ ఏడాది జులై నెలలో లడ్డూ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024 జూన్‌లో 1.04 కోట్ల లడ్డూలు విక్రయించగా, 2025 జులైలో 1.24 కోట్ల లడ్డూలు విక్రయమయ్యాయి. కాగా, 2026 జులైలో 1.30 కోట్ల లడ్డూలు విక్రయమవడం ద్వారా గత రెండేళ్ల కంటే అత్యధిక అమ్మకాలు నమోదైనట్లు దేవస్థానం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భక్తుల రద్దీ పెరగడం, శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్లే లడ్డూ ప్రసాదం విక్రయాలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.