22.8 C
Munich
Thursday, August 6, 2026

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు విద్యార్థులకు ఆదర్శం కావాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మందమర్రిలో జయంతి వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో ముందుకు సాగాలని మందమర్రి సింగరేణి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జై. పురుషోత్తం పిలుపునిచ్చారు. గురువారం మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు జై. పురుషోత్తం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ పోషించిన విశిష్ట పాత్రను, విద్యారంగానికి అందించిన సేవలను, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన నిరంతర పోరాటాన్ని స్మరించుకున్నారు. జయశంకర్ చూపిన మార్గంలో నడుస్తూ క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. అలాగే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జై. పురుషోత్తంతో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.