ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు విద్యార్థులకు ఆదర్శం కావాలి

మందమర్రిలో జయంతి వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో ముందుకు సాగాలని మందమర్రి సింగరేణి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జై. పురుషోత్తం పిలుపునిచ్చారు. గురువారం మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు జై. పురుషోత్తం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ...