బీబీపేట అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతం

ఆశీర్వాదాలు అందజేసిన ప్రజాప్రతినిధులు గ్రామస్థుల భాగస్వామ్యంతో విజయవంతమైన వేడుక కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట); బీబీపేట మండలం యాడారం హరిజనవాడ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు నిర్వహించి, వారి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వార్డు సభ్యులు కొత్తపల్లి పూజ, బ్యాగరి సుజాత, అంగన్‌వాడీ టీచర్లు అనురాధ, నరసవ్వ పాల్గొని...