NIGAMA MEDIA (P) LTD
9.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 30, 2026

రిటైర్డ్ సింగరేణి కార్మికులు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి మందమర్రి డివిజన్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించి, హెల్త్ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షుడు వాసాల శంకర్ కోరారు. శుక్రవారం మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ కార్మికులు లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించి, హెల్త్ కార్డులను రెన్యువల్ చేసుకోవడం ద్వారా పెన్షన్‌తో పాటు వైద్య సౌకర్యాలను నిరంతరంగా పొందవచ్చని తెలిపారు.

లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే పెన్షన్‌తో పాటు వైద్య సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. గతంలో 1,057 మంది రిటైర్డ్ కార్మికులు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కావున రిటైర్డ్ కార్మికులు తమ భార్యలతో కలిసి సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని సూచించారు. సర్టిఫికెట్ సమర్పించిన అనంతరం అది సక్రమంగా అప్‌లోడ్ అయిందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కోరారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణలో నిర్లక్ష్యం వహిస్తే పెన్షన్, వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మిక సంఘం గౌరవ సలహాదారు కందునూరి రాజన్న, కంబాల రాజనర్సు, నాయకులు జక్కం రాజన్న, పోల్ సంపత్, ఆసం కొమురయ్య, గసిగంటి మల్లయ్య, సీహెచ్. గట్టయ్య, వీరయ్య, ఏ. మదనయ్య, బొంగుని మల్లయ్య, జూపాక రాజులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.