ఆగష్టు 2న బీబీపేటలో బోనాల పండుగ
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండల కేంద్రంలో ఆగస్టు 2న నిర్వహించనున్న శ్రీ మహంకాళమ్మ బోనాల పండుగ జాతరను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు సమావేశమై బోనాల జాతర నిర్వహణపై చర్చించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్ణయించారు....