21 C
Munich
Sunday, July 26, 2026

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే టీజేఏ ధ్యేయం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

12వ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్
వృద్ధులకు అన్నదానం చేసి మానవత్వం చాటుకున్న యూనియన్

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) ప్రధాన ధ్యేయమని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో టీజేఏ 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను యూనియన్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాలు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులు వృద్ధులకు అన్నదానం చేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అనంతరం టీజేఏ కార్యాలయంలో పార్వతి సురేష్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సురేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి హక్కుల సాధన, సంక్షేమం కోసం టీజేఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో అసోసియేషన్ ముందుంటుందన్నారు. ఈ సందర్బంగా పలువురు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు మాట్లాడుతూ, టీజేఏను రాష్ట్రవ్యాప్తంగా బలమైన జర్నలిస్టు సంఘంగా తీర్చిదిద్దడంలో ముందుంటుందన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ అందిస్తున్న నాయకత్వం, సేవలు అభినందనీయమని వారుకొనియాడారు

కార్యక్రమంలో టీజేఏ జిల్లా నాయకులు సారంగరావు, డేగ ఆంజనేయులు, గట్టయ్య, గంగులు, అమర్నాథ్ రెడ్డి, గౌతం, పురుషోత్తం, ప్రేమ్ జీవన్, సతీష్, వినీత్, సంఘ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.