19.9 C
Munich
Sunday, July 26, 2026

బోడ జనార్దన్ TRS లో చేరిక ముహూర్తం ఖరారు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కవిత పార్టీలోకి వెళ్లొద్దంటున్న ఓ యూనియన్ నేత
మళ్ళీ కాంగ్రెస్ లోకి రావాలంటున్న ఆ యూనియన్ నేత
అయినా ముహూర్తం ఖరారు చేసుకున్న జనార్దన్
ఈ నెల 28న హైదరాబాద్ లో చేరనున్న జనార్దన్

కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) :

1985 నుంచి 2004 వరకు వరుసగా చెన్నూర్ నియోజకవర్గంకు నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఎన్టీఆర్ హయాంలో కార్మిక శాఖ మంత్రి. మరోసారి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్. ఇలా ఎన్నో పదవులు 20 ఏళ్లలో అనుభవించి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఇంతటి అనుభవం ఉన్న నేతకు రాజకీయ చదరంగంలో ఓటమి అనేది తెలియదు. కానీ 2004 లో ఓటమి చెందిన అనంతరం ఏ పార్టీలోకి వెళ్లినా కాలం కలిసిరాలేదు.

తాజాగా ఆయన కవిత స్థాపించిన టిఆర్ఎస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత పార్టీలో చేరవద్దు. తిరిగి కాంగ్రెస్ లోకి రండి, మీకు మంచి పదవి ఇప్పించే భాద్యత నాది అంటూ ఓ సీనియర్ కార్మిక నేత ప్రాధేయపడినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కవిత పార్టీలోకి వెళుతున్న విషయం తెలిసి మాట్లాడిన ఆ కార్మిక నేత మాటను సున్నితంగా జనార్దన్ తిరస్కరించినట్టు తెలిసింది.

మాజీ మంత్రి బోడ జనార్దన్ ఇప్పటికే రెండు దఫాలుగా కవితతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్తుపై ఖచితమైన హామీ పొందినట్టుగా అతని సన్నిహితుల ద్వారా తెలిసింది. కవిత పార్టీలో మే 28న చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.అయితే అదే రోజు హైదరాబాద్ లో తన అనుచరులతో చేరాలా ? లేదంటే నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో సభ ఏర్పాటు చేసి కవితను ఆహ్వానించి అనుచరులతో కలిసి చేరాలా ?అనేది తేలాల్సి ఉంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.