NIGAMA MEDIA (P) LTD
23.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Kavitha : నేను…వస్తున్నా….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మే లో పార్టీ ముహూర్తం ఖరారు
బిఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు
బిఆర్ఎస్, బీజేపీ అడ్రెస్స్ గల్లంతు
పార్టీ ఏర్పాటుపై స్పష్టం చేసిన కవిత

Kavitha : కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ పేరు ప్రకటించబోతున్నట్టుగా తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది. బిఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన నాటి నుంచి ఆమె హరీష్ రావ్, కేటీఆర్, సంతోష్ రావ్ లపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. గత నెల రోజుల నుంచి పార్టీ నిర్మాణంపై సోషల్ మీడియా ద్వారా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆమె స్పష్టమైన ప్రకటన విడుదల చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది.

తాను పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ నుంచి కూడా చేరికలు ఉంటాయి. తనతో టచ్ లో బిఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారెవరనేది సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షముగా తామే ఉంటాం, ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ , బీజేపీ కనుమరుగు కావడం ఖాయం. రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో ఎదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తాం. జిహెచ్ఎం సి ఎన్నికల నాటికి పార్టీ గుర్తు ఏర్పాటైతే అదే గుర్తుపై పోటీ కూడా చేస్తామన్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్ధిపేట, బోధన్ రెండు స్థానాల్లో ఎదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తాను. మొదటి ప్రాధాన్యత మాత్రం సిద్దిపేటకు ఉంటుంది. కవిత లక్ష్యం సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ అని చెప్పకనే చెప్పేసింది. కవిత కొత్త పార్టీ ఏర్పాటు విషయంపై బీజేపీ చీఫ్ స్పందిస్తూ కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే కనుమరుగయ్యేది బీజేపీ కాదు , బిఆర్ఎస్ అనబోయి, బీజేపీ అన్నట్టుంది. కానీ కనుమరుగయ్యే పార్టీ బిఆర్ఎస్ అని అయన అనడం కొసమెరుపు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.