19.9 C
Munich
Sunday, July 26, 2026

Pro : Kodanda Ram : కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైంది

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నేను ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే
పొత్తులపై నిర్ణయం కాలేదు
సింగరేణి తెలంగాణ సంపద

Pro : Kodanda Ram : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రకటన ఎప్పుడైనా రావచ్చు. మరోవైపు అధికార పార్టీ అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు అధికార పార్టీకి తలనొప్పిగా మారగా, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఆనందంలో ముంచెత్తాయి.

తమ పార్టీ నాయకత్వం పల్లె నుంచి పట్టణం వరకు ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని గమనిస్తున్నామన్నారు. ప్రజల అభిప్రాయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పరిపాలనలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదే విదంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దంగానే ఉన్నామని, కానీ కాంగ్రెస్ తో పొత్తు పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

సింగరేణి పై ఇటీవల వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. సింగరేణి తెలంగాణ సంపద. ఈ సంపదనను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి తెలంగాణ పౌరిడిపై ఉందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో తాను కూడా ఒక భాదితుడినేనన్నారు. తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.