19.9 C
Munich
Sunday, July 26, 2026

Mlc Kavitha : కవిత సీఎం కుర్చీ కల సాధ్యమయ్యేనా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Mlc Kavitha : నాకు ఎప్పుడో ఒకసారి టైం వస్తది కదా ? దేవుడి దయ ఉంటె ముఖ్యమంత్రి అయిత కదా ? ఒకనాడు. ఈ మాటలు అన్నది ఒక ఎమ్మెల్యేనో , ఎంపీనో కాదు. సాక్షాత్తు ఉద్యమ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత. ఆమె ఈ మాటలు అన్న తరువాత రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు పలువురు వివిధ రకాలుగా మాట్లాడారు. నిజంగానే దేవుడు దయతలిస్తే ఆమె ముఖ్యమంత్రి అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అనే మాటలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతాయి. మరో మూడేళ్ళ అనంతరం రాజకీయ చదరంగంలో ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము.

 

ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్న రాజకీయ బలమెంత అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో. ప్రస్తుతం ఆమె లిక్కర్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు రాబోయే రెండేళ్లలో రావాలి. కానీ అందుకు పరిస్థితులు ప్రస్తుతానికి వీసమంతా కూడా కనబడుటలేదు. మిగిలిన ఏడాది కాలంలో ఆమె పార్టీ నిర్మాణం, బలోపేతం చేసుకోవాలి. ఇదంతా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఆమె ప్రగల్బాలు పలుకలేదు. అందుకే …. నాకు ఎప్పుడో ఒకసారి టైం వస్తది కదా ? దేవుడి దయ ఉంటె ముఖ్యమంత్రి అయిత కదా ? ఒకనాడు అని అన్నారు.

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా బలంగానే ఉన్నవి. అధికార పార్టీకి ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. బిఆర్ఎస్ కూడా రెండు శాతం తేడాతోనే అధికారం కోల్పోయింది. బీజేపీ కి కేంద్రం ఆర్థిక, అంగ బలం పుష్కలంగా ఉంది. ఈ మూడింటిని కవిత ఒంటిచేతితోనే ఎదుర్కోవాలి. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ నుంచి బలమైన నాయకులు పార్టీ విడిచి ఆమె వెంట నడవడం లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఆమెతో కలిసి రాజకీయ ప్రయాణం చేయడానికి ముందుకు రావడంలేదు. తమ రాజకీయ అదృష్టాన్ని చూసుకోడానికి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, లేదంటే బీజేపీ ని ఎన్నుకుంటారు. కానీ కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ బలంలేని జాగృతి బాటలో నడిచి ఏరికోరి నష్టాలను ఎవరు రుచిచూడరనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
—————————————-

కొమ్మెర అనిల్ కుమార్
పొలిటికల్ బ్యూరో
9603982983
—————————————–

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.