NIGAMA MEDIA (P) LTD
17.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

IFTU : బీహార్ లో IFTU జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

IFTU : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీహార్ లోని కేహాల్గమ్ లో IFTU జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ తెలిపారు. మంగళ వారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..

కార్మికవర్గాల అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం బీహార్ సమావేశాన్ని వేదిక చేసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జాతీయ , రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని కార్మిక రంగం అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేపట్టనున్నామన్నారు. అదే విదంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు శాంతియుత పోరాటాలు దేశవ్యాప్తంగా కొనసాగుతాయన్నారు.

ఈ సమావేశంలో ఐ ఎఫ్ టీ యు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, జిల్లా నాయకులు ఐ రాజేశం, జీ మల్లేశం, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్ తోపాటు పలువురు జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.