NIGAMA MEDIA (P) LTD
16.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

Mavoist : తెలంగాణ కూలి….హిడ్మా

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Mavoist : ఏపీ లోని మారేడుమిల్లి లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ఆనవాళ్ళు తెలంగాణాలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్కౌంటర్ అనంతరం బహిర్గతమైన ఆయన ఫోటోలను, ప్రత్యక్షంగా తెలంగాణలో చూసినవారు హిడ్మా తెలంగాణ ప్రాంతంలో సంచరించాడనే అంటున్నారు పలువురు.

2015లో హిడ్మా అన్న బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతిచెందాడు. అప్పటికే హిడ్మా కూడా పార్టీలో కొనసాగుతున్నాడు. అన్నఎన్కౌంటర్ తరువాత బలగాలు హిడ్మా కోసం గాలింపు ముమ్మరం చేసాయి. దశల వారీగా పార్టీలో ఎదుగుతున్న హిడ్మా అప్పటికే కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బలగాల ఒత్తిడిలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని హిడ్మా తెలంగాణ ప్రాంతం వచ్చినట్టు సమాచారం.

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనవి. తెలంగాణ ఏర్పడిన అనంతరం కేసీఆర్ ఆ పనులను వేగవంతం చేశారు. ప్రాజెక్ట్ పనుల కోసం చత్తిస్ గడ్ నుంచి కూలీలు రావడం జరిగింది. ఆ కూలీలతో కలిసి హిడ్మా కూడా వచ్చి ఆ ప్రాజెక్ట్ పనుల్లో కూలీగా చేరినట్టు సమాచారం.

అప్పటి సిద్దిపేట ఎస్పీ డోయల్ డేవిస్ కు హిడ్మా ప్రాజెక్ట్ పనుల్లో కూలీగా చేరినట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చత్తిస్ గడ్ నుంచి వచ్చిన కూలీలందరిని ఎస్పీ విచారించారు. వారితో పాటు విచారణ ఎదుర్కొన్న హిడ్మా మాట్లాడుతున్న భాష సరిగా అర్థం కాలేదు. దింతో అనుమానాస్పద వ్యక్తిగా కేసు నమోదు చేసి జైలుకు పంపినట్టు తెలిసింది. జైలు శిక్ష పూర్తయిన తరువాత తిరిగి అడవిబాట పట్టినట్టుగా సమాచారం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.