24.4 C
Munich
Sunday, July 26, 2026

Singareni : సింగరేణి సి&ఎండి ని అభినందించిన ఏఐటీయూసీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి.
ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలి
కార్మికుల సమస్యల పై వినతిపత్రం అందజేత

Singareni : సింగరేణి బొగ్గుగని కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ కు వినతి పత్రం అందజేశారు. బంగారం, రాగి గనుల అన్వేషణ టెండర్లను పొందినందుకు ఈ సందర్బంగా సింగరేణి చైర్మన్ ను ఏఐటీయూసీ నాయకులు అభినందించారు. అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు మాట్లాడుతూ…..

2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల నుంచి కార్మికులకు 35 శాతం లాభాల వాటాను వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. జూలై నెలలో అనారోగ్యం తో బాధపడుతున్న రిఫరల్ ఉద్యోగులకు మెడికల్ బోర్డు నిర్వహించి చాలా తక్కువ మందిని ఇన్వాల్యుడేషన్ చేయడంతో కార్మికులు పలు విధాలుగా నష్టపోవడం జరిగిందని వివరించారు.ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి దరఖాస్తు చేసుకున్న వారిని ఇన్వాల్యుడేషన్ చేయాలని ఈ సందర్బంగా కోరారు.

మెడికల్ బోర్డు ను సమీక్షించి ప్రతి నెలలో నిర్వహించి అర్హులైన వారికి అనిఫిట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సి అండ్ ఎండి హామీ ఇచ్చినట్టు వారు వివరించారు. అదేవిధంగా ఇల్లందు ఏరియాలో నిర్మిస్తున్నకె ఓ సి గని నిర్వాసితులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు మిర్యాల రంగయ్య, కే. సారయ్య, కే వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, కాంట్రాక్ట్ కార్మిక సంఘం బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.