24.4 C
Munich
Sunday, July 26, 2026

Congress : ” కాక “నచ్చిన కార్యాలయం….నేతలకు కనిపించని వైనం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Congress : మందమర్రి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటేనే మాజీ కేంద్ర మంత్రి ” గడ్డం వెంకటస్వామి ” (కాక) కి నచ్చిన కార్యాలయం. ఆయన మాజీ మంత్రి హోదాలో ఉన్నా, కేంద్ర మంత్రి హోదాలో పెద్దపల్లి పార్లమెంట్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి మందమర్రి కార్యాలయంలో కొద్దిసేపు గడిపేవారు. అయన పర్యటన ఖరారు అయ్యిందని తెలిస్తే చాలు సింగరేణి విధులు నిర్వహించే పార్టీ నాయకులు గైర్హాజరు పెట్టుకొని కలిసి కాక బాగున్నారా అని పలకరించేవారు. ఆయన కూడా నాయకులను పేరుపెట్టి పిలిచేవారు. కొద్దిసేపు కాక నాయకుల యోగ, క్షేమాలు తెలుసుకొని వెళ్ళిపోయేవారు. అటువంటి కాకా మెచ్చిన పార్టీ కార్యాలయం నేటి తరం నాయకులకు కనిపించకపోవడం శోచనీయం.

వాస్తవానికి పార్టీ కార్యాలయాన్ని మందమర్రి కి చెందిన వ్యాపారి కేశ వీరేశం ప్రారంభించారు. ఆయన నుంచి మందమర్రి కి చెందిన భూస్వామి శ్రీపతిరావు అక్కడి నుంచే కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీపతి రావు తదనంతరం బోరిగం సత్యనారాయణ, ఆయన తరువాత నోముల ఎల్లాగౌడ్, గొల్ల వీరయ్య, ధర్మయ్య, తోట సత్యనారాయణ, గోగుల రాజయ్య, ఐదునూరి కృష్ణ, బత్తిని రాజయ్య, ఎస్ రాజయ్య, ఉప సర్పంచి రవి, పట్నం వెంకటేశం, బాదె ఎల్లయ్య, కాంపెల్లి రాజయ్య, బుర్ర రాజమల్లు, సోతుకు సుదర్శన్, బత్తుల రమేష్ పార్టీ జెండానే మోశారు. వీరందరిని పేరుపెట్టి పిలిచేవారు కాక వెంకటస్వామి.

వీరిలో ఎల్లాగౌడ్, ధర్మయ్య,వీరయ్య, కృష్ణ, బత్తిని రాజయ్య, ఎస్ రాజయ్య, బుర్ర రాజమల్లు, బాదే ఎల్లయ్య, కాంపెల్లి రాజయ్య కాంగ్రెస్ జెండా కప్పుకొనే కన్నుమూశారు. ఒక సందర్భంలో కాంపెల్లి రాజయ్యను సీపీఐ కి చెందిన కొందరు పార్టీలో చేరాలని జెండా స్తంభానికి కట్టేసి కొట్టినా పార్టీ మారలేదు. అదే విదంగా 20 ఏళ్ళు చెన్నూర్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ హవా కొనసాగింది. ఆయన నుంచి కూడా తెలుగు దేశంలో చేరాలని ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ చనిపోయిన వారితో పాటు, ఇప్పుడు ఉన్న తోట సత్యనారాయణ, గోగుల రాజయ్య, సోతుకు సుదర్శన్, పట్నం వెంకటేశం, బోరిగం సత్యనారాయణ, బత్తుల రమేష్ పార్టీ మారలేదు. వీరికి కూడా బిఆర్ఎస్ నుంచి అవకాశం వచ్చినప్పటికీ పార్టీ మారలేదు.

ఇంత చరిత్ర ఉండి, పార్టీనే నమ్ముకున్న వారు కొందరు ఎలాంటి రాష్ట్ర స్థాయి పార్టీ పదవిని కానీ,కార్పొరేషన్ పదవిని కానీ నోచు కోకుండానే కన్నుమూశారు. ఇప్పుడున్న నేతలు కూడా శితిలమైన పార్టీ కార్యాలయాన్నే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నారు. కానీ పార్టీ, ప్రభుత్వ పరంగా పదవులు వస్తాయని మాత్రం ఆశించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్న మాకు కాక వెంకటస్వామి సేద తీరిన గుర్తుగా కనీసం నూతన కార్యాలయాన్ని నిర్మించి ఇవ్వాలని నేటితరం నేతలను నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.