NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Rakhi : ఎథిక్ అకాడమీలో రక్షా బంధన్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Rakhi : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ …..

మేము మా విధుల్లో నిత్యం నిమగ్నంగా ఉంటాం. కానీ ఇలాంటి చిన్నారుల చేత అటు ప్రేమతో, ఇటు గౌరవంతో వచ్చిన ఈ రాఖీ వేడుక మాకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఈ తరహా సంఘటనలు మాకు మరింత ఉత్తేజాన్నిస్తాయి. సమాజం నుండి వచ్చిన కృతజ్ఞత మేము చేస్తున్న సేవను మరింత మన్నించబడి ఉందనే భావన కలిగిస్తుందని సబ్ ఇన్‌స్పెక్టర్ మజారుద్దిన్ ఆనందం వ్యక్తం చేశారు.

పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ అనేది కేవలం కుటుంబం వరకే పరిమితం కాకూడదు. సమాజాన్ని రక్షించే ప్రతి ఒక్కరికీ ఈ పండుగలో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్బంగా మన పిల్లలు స్వయంగా తయారుచేసిన రాఖీలను పోలీస్ అధికారులకు కట్టడంతో ఇచ్చిన గౌరవం, ప్రేమ చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దివాకర్ , జన్మభూమి నగర్ వాసులు పాల్గొన్నారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.