23.9 C
Munich
Monday, July 27, 2026

Singareni : సింగరేణిలో గుప్పుమన్న గోప్యత ఆదేశాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రూ : 5వేల కోట్ల అవినీతిపై విచారణ ?
ఇంటి దొంగలను కాపాడటానికేనా ?
పారదర్శకత కాలంలో ఎవరికోసం గోప్యత ?

Singareni : సింగరేణి సంస్థలో ఒక నినాదం ఉంది. ” ఒకే కుటుంబం – ఒకే లక్ష్యం – ఒకే గమ్యం “. అంటే మనమంతా ఒక కుటుంబం, అంతా కలిసి ఒక లక్ష్యం తో పని చేస్తూ గమ్యాన్ని చేరుకోవాలని నీతి సూక్తులు చెప్పింది యాజమాన్యం. అంత నియమ, నిబంధనలతో సంస్థను నడుపుతున్న యాజమాన్యం కార్మికులు ముక్కున వేలేసుకునే విదంగా ఇటీవల విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు చూసిన కార్మిక వర్గంలో ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తోంది. ఉద్యోగులందరూ గోప్యత పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరి కోసం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు. ఎవరిని కాపాడటానికి ఆదేశాలను అమలు చేస్తున్నట్టు. అంటే ఒకవేళ ఎవరైనా సంస్థ గురించి బహిరంగంగా చర్చిస్తే సంస్థ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆ ఆదేశాలతో చెప్పకనే చెప్పేసింది యాజమాన్యం.

ప్రపంచమంత, దేశమంత ప్రజాధనముతో నడుస్తోంది. ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగము పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిర్మూలన వైపు పయనిస్తున్నాయి. సింగరేణిలో అందుకు విరుద్దంగా నడుస్తోంది పరిపాలన. సింగరేణిలో అధికార యంత్రాంగం మాత్రము గోప్యత, రహస్యం వైపు పయనించడం విశేషం. ఇటీవల ఉద్యోగులందరూ గోప్యత పాటించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అధికార యంత్రాంగంతో పాటు కార్మిక వర్గాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ గోప్యత ఆదేశాల గురించి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.

యాజమాన్యం ఎందుకు గోప్యత ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది? గోప్యత ముసుగులో ఏమి జరుగబోతోంది. ? గోప్యత ముసుగులో ఏం చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి ? రూ : 5000 కోట్ల అవినీతి వ్యవహారాలపై CVC విచారణ జరుపుతోందని ఇటీవలనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్త సింగరేణి యాజమాన్యాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందా ? లేదంటే గోప్యత ఉత్తర్వుల జారీకి ఈ వార్తలే కారణమా ? అంటూ కోల్ బెల్ట్ గనులపై కార్మిక వర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పారదర్శకత చేస్తాము, జవాబు దారితనం పెంచుతాము, అవినీతి నిర్మూలన చేస్తాము, ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వం అంటాయి. కాని సింగరేణి యజమాన్యం మాత్రం అందుకు విరుద్దంగా గోప్యత అంటూ రహస్యం గురుంచి ఆదేశాలు జారీ చేయడం శోచనీయం.

చీకటిలో దొంగతనాలు, లూటీ, దోచుకోవడం సాధారణంగ గోప్యంగా జరుగుతాయని కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గోప్యత ముసుగులో గూడుపుటాని, లూటీ, ధనార్జన, దోసుకోవడము, అవినీతికి పాల్పడటం కోసమే గోప్యత ఆజ్ఞలు సింగరేణి యజమాన్యం ఇచ్చిందనే చర్చ కూడా ప్రధానంగా గనులపై జరుగుతోంది. ఏది ఏమైనప్పటికి సింగరేణి యాజమాన్యంలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అనే భయం పట్టుకుంది. భయం బయటకి కనబడక పోయినా, లోలోన మాత్రం స్పష్టంగా ఉంది. ఆ భయం కోసమే గోప్యత ఉత్తర్వులను తీసుకు వచ్చిందని కార్మిక వర్గం ఆరోపిస్తోంది.

సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన నేటి పారదర్శకత యుగంలో సింగరేణి యాజమాన్యము మాత్రం గోప్యత ఆదేశాలు జారీ చేసి తన తిరోగమన స్వభావంను చాటి చెప్పింది కార్మిక వర్గానికి. సింగరేణి యజమాన్యము యొక్క చీకటి కోణాన్నికూడా తెలియ చెప్పేసింది. రూ : 5000 కోట్ల అవినీతి లావాదేవీలు నిజం కావడానికి గోప్యత ఆదేశాలు ప్రధాన కారణమని సైతం కార్మిక వర్గం ఆరోపిస్తోంది. ఆ దేవుడే మాకు అండగా నిలిచి సింగరేణి సంస్థను కాపాడాలని కార్మిక వర్గం కోరుకోవడం కొసమెరుపు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.