NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

India : 1971 లో ఇండియా కు నమ్మకమైన మిత్రుడు ఎవరో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

India : 1971 లో మన దేశానికి, పాకిస్తాన్ కు యుద్ధం జరిగింది. అకస్మాత్తుగా మన దేశంపై పాకిస్తాన్ యుద్దాన్ని చేపట్టింది. ఊహించని రీతిలో యుద్ధం జరుగుతోంది. మన సైన్యం కూడా తగిన విదంగా ఎదుర్కొంది. మన సైన్యం బలం తో పోలిస్తే పాకిస్తాన్ సైన్యం ఎందుకు పనికిరాదు. అంత బలహీనంగా ఉన్నప్పటికీ యుద్దాన్ని కొనసాగిస్తోంది పాకిస్తాన్. ఇండియా తో తట్టుకోలేమని తెలిసి కూడా పాకిస్తాన్ సైన్యం ముందుకు వస్తోంది.

బలహీనంగా ఉన్న పాకిస్తాన్ సైన్యం ఓటమి తప్పదనే ఉద్దేశ్యంతో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇతర దేశాల సహాయాన్ని కోరింది. అప్పుడు అమెరికా, చైనా, యూకే తో పాటు తదితర దేశాలు పాకిస్తాన్ కు అండగా నిలిచాయి. ఇండియా పై దాడి చేయడానికి సిద్దమైనాయి. అమెరికా అయితే మరింత దూకుడు పెంచి సముద్ర మార్గం ద్వారా మన దేశంపై దాడి చేయడానికి సిద్దమైనది.

ఆ సమయంలో శక్తివంతమైన దేశాల్లో కొన్ని ఇండియాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. భారత దేశాన్ని అస్థిరపరచడానికి పలు దేశాలు ఏకమైనాయి. ఆ సమయంలో ఒక ఆపద్బాంధవుడు ఇండియా కు అండగా నిలిచాడు.ఆ మిత్రుడు ఎవరో కాదు. మన పొరుగున ఉన్న రష్యా. పాకిస్తాన్ కు అండగా నిలిచిన దేశాలన్నిటిని ఎదిరించి రష్యా ఇండియాకు అండగా నిలిచింది. తన వద్ద ఉన్న సైన్యాన్ని అంతా ఇండియా కు పంపింది.

భారత దేశంకు చిన్న నష్టం జరిగినా, ఆ నష్టం రష్యా కు జరిగినట్టే అవుతుందని బహిరంగంగా పాకిస్తానుకు మద్దతు నిలిచిన దేశాలను హెచ్చరించింది. ఆ హెచ్చరికతో అమెరికా, చైనా తదితర దేశాలు వెనక్కి తగ్గాయి. అందుకే కష్టకాలంలో ఆదుకున్న వారిని మరచిపోరాదంటారు పెద్దలు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.