23.9 C
Munich
Monday, July 27, 2026

jobs : రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Jobs : నిరుద్యోగులను ఆదుకోడానికి అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సిద్దంగానే ఉంటాయి. నిరుద్యోగ యువతి, యువకులు కూడా ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ నియామకాల కోసం ఆశతో ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఎదో ఒక ఉద్యోగం సాధించి కన్నవారి కళలను తీర్చాలని ఆశిస్తారు. అయితే నిరుద్యోగ యువతీ, యువకుల ఆశయాలకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల పండుగను ప్రకటించబోతోంది. సుమారుగా 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

ఎస్సి వర్గీకరణ కోసం జాబ్ క్యాలండర్ తెలంగాణ రాష్ట్రంలో ఆలస్యమైనది. ఇటీవలనే గ్రూప్-1, ఉపాధ్యాయ, పోలీస్ కానిస్టేబుల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుమారు 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఎస్సి వర్గీకరణ అమలు కావడంతో 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖలోనే 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటన్నిటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇంజనీరింగ్, నర్సు, పారామెడికల్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ అనంతరం మరో గ్రూప్-1, ఉపాధ్యాయ పోస్టులకు సంభందించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికితెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.