NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Students : పదోతరగతి విద్యార్థులకు ఎన్ని అవకాశాలో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Students : పదో తరగతి విద్యార్థులకు ఇటీవలనే పరీక్షలు పూర్తయినవి. ఫలితాలు కూడా మే మొదటి వారంలో ఇవ్వడానికి SSC బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజులకు మార్కుల మెమో అందజేస్తారు. కానీ పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు బోలెడన్ని అవకాశాలు ఉన్నవి. వాటి గురించి తెలుసుకుందాం……

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఐటీఐ లో చేరడానికి అవకాశాలు ఉన్నవి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో చేరవచ్చు. ఐటీఐ లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ కోర్సులో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సొంతంగా టెక్నీషియన్ గా ఉపాధి పొందవచ్చు. ఎలెక్ట్రికల్, ప్లంబర్ మెటీరియల్ షాప్ కూడా పెట్టుకోడానికి బ్యాంకు నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉంది.

టెన్త్ క్లాస్ తో పాలిటెక్నీక్ లో ఎంట్రెన్స్ తో చేరవచ్చు. అందులో మెకానికల్, ఎలెక్ట్రికల్, సివిల్ కోర్స్ చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరవచ్చు. పాలిటెక్నీక్ పూర్తయిన వారు నేరుగా బిటెక్ సెకండ్ ఇయర్ లో చేరడానికి అవకాశాలు ఉన్నవి.

పై చదువులు చదవాలనుకుంటే ఇంటర్ మీడియట్ చేరి ఉన్నత చదువులు కూడా చదువుకోవచ్చు. ఇంటర్ లో ప్రభుత్వ కళాశాలలు ఉచిత వసతి, భోజనంతో ఉన్న కళాశాలలు కూడా ఉన్నవి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.