22.1 C
Munich
Tuesday, July 28, 2026

nagababu : అధికారికంగా MLC నాగబాబు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

nagababu : జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు, జనసేన నాయకుడు నాగేంద్ర బాబు నామినేషన్ వేయబోతున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించారని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలనీ పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నాగబాబును రాజ్యసభకు పంపడం ఖాయమనే ప్రచారం జరిగింది. రాజకీయ సమీకరణాల నేపత్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. ఆ తరువాత నేరుగా మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ముందుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తరువాతనే మంత్రి పదవి కట్టావ్బెట్టాలనే నిర్ణయానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినట్టు సమాచారం.

ఏపీలో ఇప్పటికే నామినేషన్ ల ఘట్టం ఆరంభమైనది. ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దింపే బలం వైసీపీ కి లేదు. తెలుగు దేశం తరపున ఐదుగురు ఎమ్మెల్సీ లు ఎంపిక కావడం ఖాయం. అందులో భాగంగానే జనసేనకు ఒక సీట్ ఖాయం అయ్యింది. మిగిలిన నాలుగు తెలుగు దేశం అభ్యర్థులు దక్కించుకోనున్నారు. కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన బలం ఉన్నందున జనసేన నుంచి నాగేంద్ర బాబు ఎమ్మెల్సీ అయిపోయారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.