NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Congress : కాంగ్రెస్ పై మండిపడుతున్న ఆ హీరోయిన్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Congress : చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడుతోంది. అకారణంగా తనపై నిందలు వేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదంటూ, మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ తీవ్రంగా ఆ నటి హెచ్చరించింది. ఇంతకూ ఆ నటి ఎవరు. ఎందుకు కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది…. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల రుణం తీసుకొంది. ఆ రుణాన్ని పదేళ్ల కిందటనే వడ్డీతో సహా బ్యాంక్లో చెల్లించింది. ఇటీవల ఆ బ్యాంకు మూత పడింది. బ్యాంకు మూత పడటంతో కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుణాలు తీసుకొని చెల్లించక పోవడంతోనే బ్యాంకు నష్టాల్లోకి వెళ్లిందని, ఈ నేపథ్యంలోనే బ్యాంకు మూత పడిందని ఆరోపించారు. అదే విదంగా ప్రీతి జింటా తీసుకున్న ఋణం మాఫీ అయ్యిందని కూడా కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ట్వీట్ పై ఆరోపించారు. ప్రీతి జింటా ఋణం మాఫీ కావడం వెనుక బీజేపీ పెద్దల సహకారం కూడా ఉందని కాంగ్రెస్ నాయకులు ట్విట్ పై ఆరోపించారు.

విషయం తెలిసిన ప్రీతిజింటా స్పందించింది. తాను తీసుకున్న ఋణం రూ.18 కోట్ల ను పదేళ్ల కిందటనే చెల్లించడం జరిగిందని వివరించింది. తన రుణాన్ని ఎవ్వరు కూడా మాఫీ చేయలేదన్నారు. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.