23.9 C
Munich
Monday, July 27, 2026

IFTU : IFTU ఆధ్వర్యంలో చలో హైదరాబాద్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

IFTU : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి ఈ. నరేష్. మాట్లాడుతూ…

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో తమ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని శాంతియుత పోరాటాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్ ) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఏ వెంకన్న, బి అశోక్, చిలుక శంకర్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, కొల్లూరి మల్లేష్, మెరుగు చంద్రయ్య, ఈ రాజేందర్,డి బుచ్చయ్య ,బ్రతుకుల రాజన్న, డి బుచ్చమ్మ, కె మొగిలి, ఆర్ రాయమల్లు, టీ రాజేష్, బండ పద్మ, శారద ,మేరీ, సుధాకర్, రాజనర్సు, ఏ రవి, సత్యం ,ఎడ్ల రవికుమార్, ఎన్ రాజేందర్, కే ఎల్లయ్య, సమ్మక్క,గుండు రాజన్న,వీ. రాజనర్స్ తదితరులు పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.