23.9 C
Munich
Monday, July 27, 2026

Heart : చలికాలంలోనే గుండె జబ్బు ఎందుకు వస్తుంది ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Heart : ప్రస్తుత పరిస్థితుల్లో గుండె జబ్బు రావడం అనేది వయసుతో సంబంధం లేకుండా పోయింది. 20 ఏళ్ల వయసు వాళ్ళు కూడా గుండె పోటుతో చనిపోతున్నారు. నిద్రలో ఉన్నవారు, పనిలో ఉన్న వారు, ప్రయాణంలో ఉన్నవారు ఇలా చాలా మంది గుండెపోటుతో చని పోతున్నారు. కానీ చలికాలంలోనే ఎక్కువ మంది గుండెపోటుతో చనిపోతున్నారు. కారణం ఇదే అంటున్నారు వైద్య నిపుణులు….

అధిక రక్త పోటు ఉన్నవారికే ప్రధానంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో శరీరంలోని రక్తనాళాలు కుచించుకు పోవడం వలన ప్రమాదం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలు ఆలా కావడం వలన రక్త పోటు అధికమవుతుంది. అప్పుడు గుండె ప్రక్రియలో మార్పులు జరిగి గుండెపోటు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఛాతిలో నొప్పి రావడంతో ప్రమాదం లక్షణాలు మొదలవుతాయి. గుండెపోటు వచ్చే ముందు దవడ నొప్పి రావడం, కుడి బుజం లో నొప్పి , వీపు భాగంలో నొప్పి రావడంతో లక్షణాలు మొదలవుతాయి. నొప్పితో పాటు చెమటలు రావడం కూడా మొదలవుతాయి. ఈ లక్షణాలు కనబడితే వెంటనే సంబంధిత వైద్యుడి వద్దకు వెళ్ళాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.