NIGAMA MEDIA (P) LTD
21.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Dill raju : దిల్ రాజును తీసుకెళ్లిన IT అధికారులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Dill raju : ప్రముఖ చిత్ర పరిశ్రమ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు ఇంటిలో నాలుగోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి కీలకమైన డాకుమెంట్లు ఐటీ అధికారులు తీసుకెళ్లినట్టు సమాచారం. దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడి ఇంటిలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

దిల్ రాజు ఇంటిలో తనిఖీలు చేపట్టినప్పుడు సుమారు 21 మంది అధికారులు పాల్గొన్నట్టు తెలిసింది. ఆయన ఇంటిలో సోదాలు నాలుగో రోజు కూడా కొనసాగాయి. అయితే నాలుగో రోజు సోదాలు చేసిన అనంతరం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దిల్ రాజు ను ఆయన ప్రత్యేక కార్యాలయం ఉన్నటువంటి హైదరాబాద్ లోని శ్రీనగర్ కు ఇన్కం టాక్స్ అధికారులు తీసుకెళ్లారు. అక్కడ ఆయన కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన అనంతరం విచారించే అవకాశాలు కనబడుతున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.