19.9 C
Munich
Sunday, July 26, 2026

Horse Gram : ఉలవలు…బోలెడు లాభాలు తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Horse Gram : ఉలవలు రెండు రకాలు. ఒకటి తెల్లనివి రెండోది నల్లవి. మన శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు ఇందులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మాంసాహారానికి సమానమైన పోషకాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడం కోసం ఉలవలు తీసుకోవడం ఎంతో మంచిది. వీటిలోని ఫైబర్‌ రక్తంలోగుండె ఆరోగ్యానికి మంచిది. యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్‌ లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అతి మూత్ర వ్యాధికి ఔషధంగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. మహిళల వ్యక్తిగత సమస్యలను నివారిస్తుంది. రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.