24.4 C
Munich
Sunday, July 26, 2026

Batukamma : చీరలు ఇవ్వరంట… పైసలు ఇస్తారంట …….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Batukamma : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన మహిళలకు చీరలు పంపిణి చేసింది. చీరల పంపిణీలో అవినీతి జరిగిందని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. ఈ నేపథ్యంలో చీరల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనేది ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. చీరల స్థానంలో మరొక కొత్త పథకాన్ని అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

ఒకవేళ చీరల పథకాన్ని నిలిపివేస్తే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందా ? అనే అంశం గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. బిఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలే పలుచోట్ల నిరసన వ్యక్తం చేసారు. గతంలో మహిళలు నిరసన వ్యక్తం చేయడంతోనే ఇప్పటి ప్రభుత్వం మరో పథకం గురించి ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

మరొక పథకాన్ని అమలుచేస్తే ఎలా ఉంటది. మహిళలకు ఉపయోగపడే పథకం ఏదయితే బాగుంటది. కొత్త పథకాన్ని ప్రారంభిస్తే ప్రతిపక్ష పార్టీలతో పాటు, మహిళల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. బహుమతులు ఇవ్వాళా ? లేదంటే నగదు ఇవ్వాళా అనే అంశాలపై మంత్రివర్గంతో పాటు, సంబంధిత ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండుగలను పురస్కరించుకొని ఆయా రాష్ట్రాలు మహిళలకు ఏమి ఇస్తున్నారు.

ఏదయినా పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశ పెట్టినారా ? ఎలాంటి పథకాలు బతుకమ్మ పండుగకు అమలవుతున్నాయి. అనే అంశాలపై కూడా ఆయా రాష్ట్రాల పరిస్థితులపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. బతుకమ్మ చీరలను రద్దు చేసి మరొక పథకాన్ని అమలుచేస్తే ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడుతుంది. పలు అంశాలను పరిశీలించిన తరువాతనే బతుకమ్మ చీరల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతోంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.