14.7 C
Munich
Tuesday, July 28, 2026

Ex CM.KCR : కాకా… కారు నడుపవా… కాకా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Ex CM.KCR : తెలంగాణ ఉద్యమనేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు దాటి కాలు బయటపెట్టడంలేదు. పార్టీ శ్రేణులను కూడా పట్టించుకోవడంలేదనే అభిప్రాయాలు సైతం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. చివరకు ప్రజల వద్దకు కూడా రావడానికి ఆయన ఎందుకో ఇష్టపడటంలేదు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేదు. కాబట్టి ప్రజల్లోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనంలేదు. పార్టీ గుర్తుపై గెలిచిన నాయకులు వెళ్లిపోతున్నారు. కేసీఆర్ మాత్రం తన ఇంట్లో నాయకులతో సమావేశానికి పరిమితం అవుతున్నారు. కానీ పార్టీని బలోపేతం చేయడానికి జనంలోకి మాత్రం రావడంలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. ఇటీవల అసెంబ్లీలో సైతం ఒక్కరోజు ” మమ ” అనిపించారు.

నాయకుల వలసలు నిలిచిపోవాలంటే జనంలో కూడా తగినంత బలం తప్పనిసరి. కేసీఆర్ లెగ్ వర్క్ చేస్తున్నాడంటేనే నాయకులుకు కూడా బయం ఉంటది. అదేవిదంగా పార్టీ మారితే తన నియోజకవర్గంలో ఏమవుతుందో అనే బయం ఏర్పడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. చివరకు కేసీఆర్ తన సొంత జిల్లాల్లో కూడా పట్టు నిలుపుకోలేకపోయారు.
ఇటువంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు కేసీఆర్. ఢిల్లీ లో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఢిల్లీ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.

ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది.అయినప్పటికీ రుణమాఫీ విషయంలో రైతులు పలు ప్రాంతాల్లో అసంతృప్తిగానే ఉన్నారు. వాళ్లకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినా కేసీఆర్ ముందుకు రావడంలేదు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం హరీష్ రావ్, కేటీఆర్ లతో సాధ్యమయ్యే పరిస్థితి ఏమాత్రం కనబడటం లేదు. రేవంత్ రెడ్డి ని ఢీకొనాలంటే కేవలం పార్టీ పరంగా కేసీఆర్ తోనే సాధ్యమవుతుంది. ఇందుకు తార్కాణం ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలే. గులాబీ శ్రేణులు కూడా కేసీఆర్ బయటకు వస్తేనే పార్టీ నిలబడుతుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం గడప దాటడంలేదు.

ప్రస్తుతం కేసీఆర్ తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. కూతురు కవిత విషయంలోనే ఆందోళన చెందు తున్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడమే అయన ముందున్న ప్రధాన సమస్య. పార్టీ ఎలాగూ అధికారంలో లేదు. ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ పార్టీకి ఒరిగేది ఏమిలేదు. అందుకనే కేసీఆర్ పార్టీ గురించి ఆలోచించడంలేదనే అభిప్రాయాలు గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. కవిత కు ముందుగా బెయిల్ రావాలి. బెయిల్ వచ్చిన తరువాతనే మిగతా విషయాల గురించి ఆలోచించే పరిస్థితి ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో సైతం వ్యక్తమవుతున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.