14.7 C
Munich
Tuesday, July 28, 2026

Mixed Ghee : ఆ నెయ్యి వాడకండి…నెయ్యిలో నూనె కలుపుతున్నారు…. బ్లాక్ లిస్టులో పెట్టేసిన అధికారి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Mixed Ghee : పాల నుంచి తయారయ్యే పదార్థాలల్లో నెయ్యి ఒకటి. నెయ్యి వాసన ఎంతో కమ్మగా ఉంటుంది. నెయ్యి తో చేసిన పిండి వంటలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నేతితో చేసిన లడ్డూలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. నేతితో రకరకాల స్వీట్లు చేస్తారు. భక్తులు యాదాద్రి, తిరుపతి, వేములవాడ, శ్రీశైలం దేవస్థానంలకు వెళితే అక్కడ లడ్డు ప్రసాదాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేసి ఎంతో ఇష్టంగా తింటాం. దేవస్థానాల్లో లడ్డు ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం. ఆ ప్రసాదం ఎంతో కమ్మగా ఉంటది. ఎన్ని లడ్డూలు తిన్నప్పటికీ ఇంకా తినాలి అని నోరు ఊరుతుంది. తిరుమల లడ్డు ఇప్పడు కల్తీ నెయ్యి తో తయారు అవుతున్నదని తెలిసిపోయింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వెళుతారు. దర్శనం తరువాత తప్పనిసరిగా లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తారు. ఏపీ లోని గత ప్రభుత్వం హయాంలోనే లడ్డూ తయారీపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం టీటీడీ ఈవో గ శ్యామల రావ్ ను నియమించింది. ఆయన వచ్చి రావడంతోనే లడ్డూ ప్రసాదం నాణ్యత పై దృష్టి సారించారు. భక్తులు చేస్తున్న విమర్శలను ఈవో పరిగణలోకి తీసుకున్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థ తో పాటు, నెయ్యి పై విచారణకు ఆదేశించారు.

టీటీడీ కి ఐదుగురు కాంట్రాక్టర్లు నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఆ ఐదుగురు సరఫరా చేస్తున్న నెయ్యిలో ఒక సంస్థ కు చెందిన నెయ్యి కల్తీ చేసి టీటీడీ కి సరఫరా చేస్తున్నట్టు నాణ్యత పరీక్షల్లో తేలింది. వెంటనే ఈవో శ్యామల రావ్ నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి, షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. ఆ సంస్థ 8.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ దక్కించుకుంది. 68 వేల కిలోల నెయ్యి సరఫరా చేయగా, అందులో 20 వేల కిలోల నెయ్యి నాణ్యత లేనిదని గుర్తించారు. నూనె కలిపి సరఫరా చేసినట్టు నాణ్యత పరీక్షల్లో తేలింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.