24.4 C
Munich
Sunday, July 26, 2026

Curry Leaves Benefits : మన ఇంటిలోనే కొవ్వును కరిగించే ఆకు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Curry Leaves Benefits : నిజజీవితంలో మనం తినే ఆహారం ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఫ్రై వంటలు ఎక్కువగ ఇష్టపడుతాము. బేకరీ కి వెళితే రకరకాల పదార్థాలు. ఇంకా చెప్పాలంటే నూనెలో కాల్చిన పిండి వంటలు. ఇవన్నీ కూడా మన శరీరంలో కొవ్వును పెంచేస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది. ఇలా పెరిగిన కొవ్వు మనకు అనారోగ్యమే అవుతుంది. వీటివలన బీపీ, కొలెస్ట్రాల్, గుండె పోటు, మధుమొహం వంటివి కూడా శరీరానికి హాని చేస్తాయి. మనం తినే ఆహార పదార్థాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంటిలో మనం సాంబారు (పప్పు చారు ) చేస్తున్నామంటే ఖచ్చితంగా అందులో కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు మన ఇంటిలో లేదంటే పక్కింటిలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి పక్కింటికి వెళ్లి తెచ్చుకొని సాంబారు వేస్తాం. కానీ తినేటప్పుడు ఆ కరివేపాకును ఎక్కువ శాతం మంది తీసివేసి తింటారు. ఇది సహజం. ఆ కరివేపాకును తిన్న వారు గొప్పవాళ్ళు. కరివేపాకు మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇనుము, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి మొదలైన అనేక ముఖ్యమైన పోషకాలు కరివేపాకులో ఉన్నాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఆల్కలాయిడ్స్ పుష్కలంగా కరివేపాకులో ఉంటాయి. ఇది మన శరీరంలోని లిపిడ్లు, కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతాయి. దీని రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ సైతం తగ్గిపోతాయి. రక్తంలో ఉన్నటువంటి చక్కెర పరిణామం అదుపులో ఉంటుంది.

కరివేపాకును శుభ్రముగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి ఉడకపెట్టాలి. బాగా మరిగిన తరువాత వడపోయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పరిగడుపున మాత్రమే తాగాలి దీనితో మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కొద్దిరోజుల్లోనే తగ్గిపోతుంది. కానీ కరివేపాకు రసాన్ని తాగే ముందు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.