18.5 C
Munich
Monday, July 27, 2026

Ghee Benefits : నెయ్యి ఒంటికి మంచిదే …. కానీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Ghee Benefits : పాడి పరిశ్రమలో పాలు ప్రధానమైనవి. పాల నుంచి పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఉత్పత్తి అవుతాయి. వీటితో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాం. ఈ పదార్థాలను భోజనంలో కూడా ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటివే. కానీ నెయ్యి వాడితే శరీరానికి మంచిదా ?. కాదా అనే విషయాలను ఇప్పడు తెలుసుకుందాం. నెయ్యిలో పోషక పదార్థాలు కూడా ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం.

వేడి,వేడి అన్నంకు కాస్తంత ముద్దపప్పు, ఇంత ఆవకాయ పచ్చడి, కాసింత నెయ్యి వేసుకొని నాలుగు ముద్దలు తింటే, ఇంకా మరో నాలుగు ముద్దలు తినాలని నోరు ఊరుతుంది. నెయ్యి తో చేసిన రెండు రొట్టెలు తింటే , ఇంకా మరో రెండు రొట్టెలు తినాలని కోరుకుంటాం. నెయ్యితో చేసిన పదార్థాలు తింటే బరువు పెరుగుతారని చాలా మందిలో ఒక అనుమానం. కానీ రోజు రెండు చెంచాల నెయ్యి తింటే ఆరోగ్యపరంగా శరీరానికి ఎంతో ఉపయోగం అని అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు పొందుపరిచారు.

భోజనంలో మొదటి రెండు ముద్దలకు ఒక చెంచా నెయ్యి కలుపుకొని తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మనం తిన్న అన్నం కూడ తొందరగా జీర్ణం అవుతుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారికి సైతం ఇబ్బంది ఉండదు. ఇందులో పోషకాలు ఎక్కువ. ప్రధానంగా కంటిచూపును మెరుగుపరుస్తుంది. A విటమిన్ అధికంగా ఉంటుంది.

నెయ్యిలో ఉండే కొవ్వుపదార్థము శరీరం అధిక బరువును అదుపులో ఉంచుతుంది. E విటమిన్ కాలేయాన్ని ఆరోగ్యముగా ఉంచుతుంది. హార్మోన్లను సమానంగా ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో నొప్పులను నివారిస్తుంది. దంత సమస్యలను నివారిస్తుంది. ఎముకలు దృడంగా తయారవుతాయి. శరీరంలో మలినాలను తొలగిస్తుంది. నెయ్యితో చేసిన పదార్థములను తినాలనుకునేవారు, భోజనంలో వాడాలనుకునే వారు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.