20.5 C
Munich
Monday, July 27, 2026

Mavoist arest :సభ్యులను కోర్టులో హాజరు పరచాలంటూ మావోయిస్టు లేఖ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Mavoist arest : ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడుపాల గ్రామం వద్ద ఈ నెల 12న ఉదయం పది గంటలకు నిరాయుధులైన ముగ్గురు సభ్యులను గ్రే హాండ్స్ పోలీసులు పట్టుకొన్నారని మావోయిస్టు వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించింది. గ్రేహాండ్స్ పోలీసులు పట్టుకున్న వారిలో రీతా, మోతీ, ఇడిమాల్ ఉన్నారని, ఆ ముగ్గురితో పాటు తమ పనుల కోసం అడవి మార్గంలో వెళుతున్న మరో ముగ్గురిని కూడా పట్టుకున్నారని శాంత తన ప్రకటనలో ఆరోపించింది.

పట్టుకున్న సభ్యులను బాంబుల గురించి చెప్పాలని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ముగ్గురు సభ్యులను ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది. ఆ ముగ్గురిని వెంటనే 24 గంటల్లో కోర్ట్ లో హాజరు పరచాలని ఆమె డిమాండ్ చేసింది. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు అక్రమ అరెస్టులను ఖండించాలని శాంత తన ప్రకటనలో కోరారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.