18.5 C
Munich
Monday, July 27, 2026

BJP Target 2028 : బీజేపీ లక్ష్యం 2028

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BJP Target 2028 : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కి పెద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. వెలకట్టలేని ఆనందంలో మునిగి పోయింది. అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఎదుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు గుబులు మొదలైనది. కానీ బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయనే సంతోషంలో ఉంది. తెలంగాణ లక్ష్యం 2028 గా పెట్టుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పనిచేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రము నుంచి ఎనిమిది మంది విజయాన్ని ఎత్తుకున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతామని ధీమాలో ఉంది. అందుకు తగిన ప్రణాళికలు చేపడుతోంది.

పదుల స్థానంలో గెలవాలనే లక్ష్యంతో పోటీలో గట్టి అభ్యర్థులనే దింపింది. అక్కడి వరకు వెళ్లక పోయినా ఎనిమిది సీట్లు సాధించి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ లకు గట్టి పోటీ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్టానంతో బీజేపీ సరిపెట్టుకుంది. అదేవిదంగా పార్లమెంటుకు నలుగురు వెళ్లారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది స్థానాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులను గెలిపించుకొని ప్రధాన పార్టీలకు తన బలమెంతో చెప్పకనే చెప్పేసింది.

2018లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కేవలం ఏడు శాతం ఓట్లతోనే సరిపెట్టుకుంది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే. అతి కొద్ది నెలల్లోనే 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 19 శాతం ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో నలుగురు ఎంపీలను సాధించుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లు సాధించింది. ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో అడుగుపెట్టారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు తాజాగా సాధించిన బలంతో అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

 

 

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.