17.5 C
Munich
Tuesday, July 28, 2026

మల్కాజిగిరిపై ముచ్చటపడుతున్న ముఖ్యమంత్రి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 15 స్థానాల్లో విజయం సాధించాలని పీసీసీ లక్ష్యముగా పెట్టుకొంది.బిఆర్ఎస్, బీజీపీ కంటే దీటుగా ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ప్రతి మంత్రి పరిధిలోని ఎంపీ సీటు మంత్రులకు ప్రతిష్టాత్మకం అయ్యింది.గెలుపు భారం మంత్రులపై పడింది.అదేవిదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా గెలుపు భారం పడింది.సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని మహబూబ్ నగర్ స్థానం తోపాటు మొన్నటివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ స్తానం గెలుపు భారం కూడా సీఎం పైననే ఉంది.సీఎం గెలిచిన స్థానాన్నితిరిగి సీఎం రేవంత్ రెడ్డి దక్కించుకోకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ,బిఆర్ఎస్ పార్టీ లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.మల్కాజిగిరి స్థానాన్ని తిరిగి రెండోసారి గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి ముచ్చటపడుతున్నాడు.ఆ ముచ్చట తీరకుండా చేయాలని ప్రధాన పార్టీలు రాజకీయ ఎత్తుగడలు ప్రారంభించాయి.
దేశంలోనే అత్యధిక ఓటర్లు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 37,28,000 ఓటర్లు ఉన్నారు.ఇక్కడి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.ఈమె విజయం కోసం కాషాయం,గులాబీ గూటిలో అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ చేర్చుకోడానికి ఆకర్ష్ పథకాన్ని చేపట్టింది. మున్సిపల్,మండల,పట్టణ స్థాయి నాయకులతోపాటు స్థానిక సంస్థల్లో ప్రధాన పార్టీల తరుపున గెలిచి అసంతృప్తితో ఉన్న వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి ముందుకు వస్తున్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో 37,28,000 మంది ఓటర్లు ఉండగా, ఎల్బీ నగర్,మేడ్చల్,కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోనే 19,50,000 మంది ఓటర్లు ఉన్నారు. విశేషమేమిటంటే ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో గులాబీ నాయకులే ఎమ్మెల్యేలుగా గెలిచారు.కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఎల్బీ నగర్ గులాబీనేత రామ్మోహన్ గౌడ్ ను పార్టీలోకి తీసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉండనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న జంపన ప్రతాప్ ను కాంగ్రెసులోకి తీసుకున్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పదిమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఘట్కేసర్ మున్సిపాల్టీ చైర్ పర్సన్ పావని యాదవ్, మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఇటీవలనే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని తిరిగి దక్కించుకోడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండగా, ఆ స్థానంలో తామే గెలిచి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించాలని బిఆర్ఎస్,బిజెపి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఈమేరకు ఫలించనున్నాయో వేచిచుడాల్సిందే.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.