19.2 C
Munich
Tuesday, July 28, 2026

మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడిన చిరంజీవి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
ప్రముఖ నటుడు చిరంజీవి తొమ్మిదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు.ఇక సినిమాల్లోకి రాడని అభిమానులు సైతం నిరాశకు లోనయ్యారు.తొమ్మిదేళ్ల తరువాత రాజకీయాలను వదిలేసి కళామతల్లి ఒడిలోకి చేరిపోయారు చిరంజీవి.డూప్ లేకుండా నటిస్తూ, డ్యాన్స్ తో అభిమానులను మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సినీ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు.పరిశ్రమలో తనవారంటూ లేకుండానే మగమహారాజు అయ్యాడు.అటువంటి చిరంజీవి ఆహా ఓటిటి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి అతిథి గ రావడం జరిగింది. ఈ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగిస్తూ మరోసారి రాజకీయాల గురించి ప్రస్తావించారు. రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికినీ పెద్దగా చొరవ తీసుకోలేదు.కానీ రాజకీయ ప్రముఖులతో హైదరాబాద్ ఉంచి ఢిల్లీ వరకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కోరుకుంటారు.హైదెరాబాద్ లో శనివారం ఆయన మాట్లాడిన మాటలు సోషియల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఈ సందర్బంగ చిరంజీవి మాట్లాడుతూ ప్రజలకు సేవచేయడానికి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశాను. అయినప్పటికిని ఆ సేవలు సంతృప్తిని ఇవ్వలేదు.అభిమానులు సహకారంతో మరింత మెరుగయిన సేవచేయడానికి పార్టీ నిర్మాణం చేయడం జారిందన్నారు.నేను రాజకీయాల్లోకి వచ్చి తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కొద్దీ రోజులకు అర్థమయ్యిందన్నారు.రాజకీయాలకు నాలాంటి వ్యక్తి సరిపడే వ్యక్తి కాదని తెలిసిపోయిందన్నారు.తొమ్మిదేళ్ల తరువాత తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెడితే అభిమానులు ఆదరిస్టారో లేదోననే అనుమానం వచ్చిందన్నారు.కానీ ఎప్పటిమాదిరిగానే అభిమానులు ఆదరించడంతో,ఇక శరీరంలో శక్తి ఉన్నంత మేరకు అభిమానులను,సినీరంగాన్ని వదిలిపెట్టనని ,రాజకీయాల్లోకి కాలు పెట్టనని నిర్ణయం తీసుకున్నానని సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో స్పష్టం చేసారు. అభిమానుల నుంచి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత,అనురాగం పొందుతున్న కాబట్టి మీకోసం నా ఒంట్లో ప్రాణం ఉన్నతమేరకు సినిమాలు తీస్తానని చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.