మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడిన చిరంజీవి
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ ప్రముఖ నటుడు చిరంజీవి తొమ్మిదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు.ఇక సినిమాల్లోకి రాడని అభిమానులు సైతం నిరాశకు లోనయ్యారు.తొమ్మిదేళ్ల తరువాత రాజకీయాలను వదిలేసి కళామతల్లి ఒడిలోకి చేరిపోయారు చిరంజీవి.డూప్ లేకుండా నటిస్తూ, డ్యాన్స్ తో అభిమానులను మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సినీ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు.పరిశ్రమలో తనవారంటూ లేకుండానే మగమహారాజు అయ్యాడు.అటువంటి చిరంజీవి ఆహా ఓటిటి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి అతిథి...