NIGAMA MEDIA (P) LTD
18.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

ఢిల్లీ — కోరుట్ల లిక్కర్ ప్రయాణం ???

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కవిత బినామీ ఆస్తులు కోరుట్లలోనే ???
కోరుట్ల,మెటుపల్లి ప్రాంతాల్లో వాలిన ED
బినామీ నాయకుల్లో మొదలైన గుబులు
తీహార్ జైలులోనే కవిత
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి :
స్వయానా ముఖ్యమంత్రి కూతురు కావడంతో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ వ్యాపారాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది.రాష్ట్రాల ఎల్లలు దాటి నేరుగా ఢిల్లీ అధికార పార్టీ నాయకులతోనే ఆమె సత్సంబందాలు పెట్టుకొని లిక్కర్ వ్యాపారం చేయడం చర్చనీయాంశం అయ్యింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొనే ఆమె అడ్డదారిన ఆర్థికంగా ఎదగడానికి ఢిల్లీ నాయకులతో కలిసి వ్యాపార సంబంధాలు పెట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.లిక్కర్ వ్యాపారంలో ఎవరి పాత్ర ఎంత ఉందొ ఏమో కానీ ఎట్టకేలకు ఆరోపణ వచ్చిన ఏడాదికి ఎమ్మెల్సి కవితను ED అరెస్టు చేసింది.తీహార్ జైలు లో నిద్రచేయక తప్పలేదు. కవిత పై ఏడాది కిందట ఆరోపణలు రావడం,అరెస్టు కావడం,బెయిల్ రాకపోవడంతో దేశవ్యాప్తంగా సంచలనమైనది.
నిజామాబాద్ ఎంపీగా ….
ఎంపీగా ఆమె రాజకీయ ప్రయాణం వేగవంతమైనది.పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టడంతో తిరుగులేని నిజామాబాద్ నియోజకవర్గంలో నాయకురాలైనది.పార్లమెంట్ పరిధిలో అధికారవర్గం అంత కూడా ఆమె కనుసన్నల్లోనే పయనించింది.చెప్పిన పని చేయాల్సిందే. చేయకుంటే శాకాపరంగా చర్యలు ఎదుర్కొన్న అధికారులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.కవిత ఆర్థికంగా ఎదగడానికి ఒక దరి ఎంచుకుంటే, ఆమె అనుచరులు మాత్రం ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తించారనే అరోపణలు సైతం ప్రజల్లో ఉన్నాయి.కవిత అనుచరులుగా ఎదిగిన పలువురు నాయకులు భూ కబ్జాలు,అక్రమ వసూళ్లు,అధికారులకు వేధింపులు, అక్రమ బదిలీల వ్యవహారాల్లో భాగస్వాములైనారు.కోరుట్ల,మెట్టుపల్లి ప్రాంతాల్లో ED విచారణ చేపట్టిందని విషయం గుప్పుమనడంతో చెలరేగిన కవిత అనుచరుల్లో పలువురు తలపట్టుకున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనంటూ ఆందోళన చెందుతున్నారు పలువురు కవిత అనుచరులు.
నోట్ల రద్దుతో మొదలై ….
నిజామాబాదు పార్లమెంట్ పరిధిలో కవిత అక్రమ సంపాదన నోట్ల రద్దుతోనే మొదలైనదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కవిత తనకు నమ్మిన బంటు వద్ద 2 వేల నోట్లను పెద్ద మొత్తంలో దాచిపెటింది.కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయడానికి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె వాటిని మార్పిడి చేసుకోడానికి తన అనుచరుని వద్దకు తన మనసులను పంపింది. రెండువేల నోట్లు దాచిపెట్టిన వ్యక్తి ఒక్కసారిగా కనిపించక పోవడంతో అంత డబ్బు ఎక్కడిది అనే చర్చ నియోజక వర్గంలో మొదలైనది.కోరుట్ల శివారులోని ఓ భూమి విషయంలో జోక్యం చేసుకోవడం వివాదాస్పదం అయ్యింది.తండ్రి ముఖ్యమంత్రి కావడంతోనే ఆ వివాదం కాస్త బయటకు రాలేదని పలువురు గులాబీ శ్రేణుల సమాచారం.ఢిల్లీ లిక్కర్ సంపాదన కోరుట్ల,మెటుపల్లి ప్రాంతాల్లో భూములపై పెట్టుబడులు పెట్టినట్టుగా చెవులు కొరుక్కుంటున్నారు.ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికార యంత్రాంగం కవిత బినామీలు ఎవరు,గతంలో వారి ఆస్తులు ఎంత,వారి ఆదాయం ఎంత,ప్రస్తుతం వారి ఆస్తులు ఏ మేరకు పెరిగాయి,వారి సంపాదన స్థిరంగా ఉండ,బలోపేతమైనదా అనే కోణంలో విచారణ చేపట్టినట్టుగా తెలిసింది. రహస్యంగా సాగిన విచారణ కాస్త గుప్పుమనడంతో బినామీ నాయకుల్లో గుబులు మొదలైనది. పార్లమెంట్ పరిధిలో నిజాలు బయట పెట్టిన పలువురు పాత్రికేయులను సైతం మానసికంగా,శారీరకంగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కవిత అనుచరుల వలన నష్టపోయిన ఓ సామజిక వేత్త ఇటీవల కోరుట్ల తహశీల్ దార్ కార్యాలయం ఎదుట
మౌన దీక్ష చేపట్టడం విశేషం.అధికారి అయినా,ప్రతిపక్ష పార్టీ నాయకుడైన,పాత్రికేయుడైన, ఎవరైనా సరే దారికి వస్తే సరే, లేదంటే సామ,దాన,భేద,దండోపాయం ప్రయోగించిన సందర్భాలు సైతం ఉన్నాయనే అభిప్రాయాలు పార్లమెంట్ పరిదిలో వ్యక్తమవుతున్నాయి.
గుట్టుగా విచారణ ….కోరుట్ల,మెటుపల్లి ప్రాంతాల్లో గుట్టుగా విచారణ మొదలుకావడంతో కవిత అనుచరుల్లో గుబులు మొదలైనది. తండ్రి అధికారాన్ని ఆమె అడ్డుపెట్టుకొని ఆర్థికంగా ఎదగడానికి అడ్డదారిని ఎంచుకున్నదనే అభిప్రాయాలు ఆమె అరెస్టు నేపథ్యంలో వ్యక్తం అవుతున్నాయి. తాజాగా కోరుట్ల,మెటుపల్లి ప్రాంతాల్లో విచారణ మొదలైనదనే విషయం గుప్పుమనడంతో ఆమె అనుచరులు తలపట్టుకుంటున్నారు. ఆమె అండతో అందలం ఎక్కినవారు కొందరు ప్రస్తుతం బయట కనబడటంలేదంటున్నారు స్థానికులు. విచారణ జరుగుతున్నది నిజమా,నీకేమైనా తెలిసిందా,నా కోసమైతే ఎవరు రాలేదు అంటూ కవిత అనుచర వర్గానికి చెందిన పలువురు తెలుసుకుంటున్నారు. విచారణ కోసం స్థానికేతర అధికార వర్గం ఆ రెండు పట్టణాలకు వచ్చిందో,రాలేదో తెలియదు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా.వచ్చింది నిజమే అంటూ పలువురు బడా నాయకులే బహిరంగంగా చర్చించుకోవడం విశేషం.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.