Thirumala Thirupathi : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల కాలంలో తిరుమల కొండపై భక్తులకు అనేక కొత్త నిబంధనలు వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఆ నిబంధనలతో ముఖ్యంగా సీనియర్ సిటిజెన్ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలి నడకన వెళ్లే భక్తులకు కూడా దర్శన భాగ్యం కోసం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసారు.
అంతే కాదు ఒకసారి దర్శనం చేసుకున్న భక్తుడు మరచిపోకుండా ఉండే విదంగా కొండపై సౌకర్యాలు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం విశేషం. అందుకు తగిన అధికారి గా శ్యామల రావు ను గుర్తించి ప్రభుత్వం EO గా నియమించింది. ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా ఈవో శ్యామల రావు తనదయిన శైలిలో చర్యలు చేపట్టారు. విస్తృతంగా తనికీలు చేస్తున్నారు. భక్తులతో సౌకర్యాలపై ఆరాతీస్తున్నారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనంను ఏవిదంగా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనం అమలవుతుంది. దీనివలన సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. దింతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. స్వామి నైవేద్యం సమయంలోనే బ్రేక్ దర్శనాలను ముగించడానికి దేవస్థానం అధికారులు ఆలోచిస్తున్నారు.
సామాన్య భక్తులకు వసతి గదులు అందుబాటులో ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి 7800 వసతి గృహాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నడక మార్గంలో వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదంలో నాణ్యత, పచ్చదనం, పారిశుధ్యం, భక్తుల రద్దీ తట్టుకునే విదంగా ఏర్పాట్లు చేయడంలో
ప్రభుత్వం నిమగ్నమైనది.