Renu Deshay : ప్రముఖ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియా లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొంది. ఆమెతోపాటు పిల్లలు అఖీరా, ఆధ్య గురించి కూడా సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పై పవన్ అభిమానులు కూడా స్పందిస్తుంటారు.
తాజాగా రేణూ దేశాయ్ తన ఇంట్లో నిర్వహించిన పండుగలు, పూజలు, వ్రతం, హోమము గురించి సోషల్ మీడియా లోపోస్ట్ చేసింది. అదే విదంగా పూజలకు చేసిన నైవేద్యం, అలంకరణ గురించి కూడా మీడియాలో చెప్పింది. ఎప్పటి మాదిరిగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె పెడుతున్న పోస్ట్ లపై స్పందించారు.
ఒక అభిమాని స్పందిస్తూ వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పడితే బాగుండేది. ఆ దేవుడి అంతరంగం తెలుసుకోకుండా వెళ్లిపోయారు. కానీ ఆయన విలువ మీకు ఇప్పుడు తెలిసింది. అంతా కూడా విధి నిర్ణయం చేస్తుంది. పిల్లలు అన్నయ్య దగ్గరకు వచ్చారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం. అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు .
పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్ చూసి అసహనం వ్యక్తం చేసింది. మీకు కొంచెమైనా బుద్ధి ఉందా. బుద్ధి ఉంటె ఇలా అనేవారు కాదు. ఆయన నన్ను వదిలేసి మరొక పెళ్లి చేసుకున్నారు. నేను చేసుకోలేదు. నన్ను ఇబ్బంది పెట్టవద్దు అంటూ దండం పేట్టేశారు రేణూ దేశాయ్.