Bathing in River : ప్రతిరోజు ఇంటిలో స్నానం చేస్తాము. కానీ ఈ సమయంలోనే స్నానం చేయాలనే నిబంధన ఎవరు దాదాపుగా నిర్ణయించుకోరు. కొందరు ఉదయం ఆరు గంటల లోపే స్నానం చేస్తారు. మరికొందరు రాత్రివేళ స్నానం చేస్తారు. సాయంకాలం అయితే వాతావరణం చల్లగా ఉంటుందని. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పుణ్య నదులలో స్నానం చేస్తాం. చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకోగానే సమయం కూడా చూడకుండా నదిలో స్నానం చేసి సమీపంలో ఉన్న దేవాలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. నదిలో ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయరాదని వేదం చెబుతోంది.
హిందువుల కుటుంబాలలో నదులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గంగ, యమున, గోదావరి, సరస్వతి, కృష్ణ నదులు ఉన్నాయి. ఇవి భగవంతుని అవతారాలుగా భావించి పూజిస్తారు. తల్లిగా కొలుస్తారు. నదిలో స్నానం చేయడం వలన తెలిసి, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. సనాతన ధర్మం ప్రకారం నదులల్లో స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం నదిలో స్నానం చేయడానికి నిర్దిష్టమైన సమయం ఉంటుంది. పురాణాల్లో ఉన్న గ్రంధాల్లో నది స్నానం గురించి స్పష్టంగా చెప్పబడింది. రాత్రి సమయంలో యక్షులు పవిత్ర నదుల దగ్గర స్నానం చేసి కూర్చుంటారని పురాణంలో ఉంది. యక్షులు నీరు, అడవులు, చెట్లతో సంబంధం పెట్టుకుంటారు. రాత్రి సమయంలోనే చాలా వేగంగా కదులుతుంటాయి. రాత్రి వేల నదుల వద్ద గడుపుతాయి. కాబట్టి రాత్రి సమయంలో పవిత్రమైన నదుల్లో స్నానం చేయరాదు. సంధ్యావందనం కాకముందే నదుల్లో స్నానం చేయాలని పురాణాల్లో పొందుపరచి ఉంది.