Morning hours : ఉదయం నిద్ర లేచింది మొదలుకొని పూజలు చేసే వరకు ఏమి ఆచరించాలి. ఎలాంటి పూజలు చేయాలి. ఎవరిని పూజించాలి. ఏ పూజలు చేస్తే లక్ష్మి దేవి ఆశీస్సులు పొందుతాం. ఉదయం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటామనే విశ్వాసం ఉంది. ఉదయం నిద్ర లేవగానే శ్రీ కృష్ణుడి ఫోటో చూడటంతో చాలా శుభం జరుగుతుంది.
బ్రహ్మ ముహర్తంలో మేల్కొంటే రోజంతా సంతోషంగా గడుపుతారని సనాతన శాస్త్రంలో స్పష్టం చేయబడింది.
బ్రహ్మ ముహర్తంలో నిద్ర లేవడం శుభం.సూర్యోదయంతో నిద్ర లేవడం వలన ఆరోగ్యముగా ఉంటారు. అదేవిదంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కావాల్సినంత మానసిక బలం చేకూరుతుంది. ఉదయాన్నే నిద్రలేచి పలు రకాల పనులను చేయాలి. ఈ పనులను చేయడంతో లక్ష్మీ దేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుందని వేదంలో చెప్పబడింది.
ప్రతి రోజు ఉదయం స్నానం పూర్తికాగానే ఇంటి పూజ గదిలో ఆవునెయ్యితో దీపం వెలిగించాలి. దింతో మన ఇష్ట దేవతల అనుగ్రహం వస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. రాత్రి కాగానే రాగి చెంబు నిండుగా నీళ్లు నింపాలి. అందులో తులసి దళాన్ని వేయాలి. ఉదయం స్నానం చేసి ఆ నీటిని ఇంటిలోపల, ఇంటి చుట్టూ చల్లాలి. దింతో నెగిటివ్ ఏదయినా ఉంటె పోతుంది. లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుంది.
ఉదయం స్నానం పూర్తి కాగానే సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు, కుంకుమ, మందార పూలు వేసి సూర్యభవానుడికి ఆర్గ్యం సమర్పించాలి. దింతో చేసే పనిలో విజయం సాధిస్తాం. హిందువులు గోమాతను చాలా పవిత్రంగా పూజిస్తారు. ఆవు దేహంలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఉదయం స్నానము పూర్తి కాగానే గోవును ఇష్టమయిన పద్దతిలో పూజించండి. లక్ష్మి దేవి అనుగ్రహిస్తుంది.