Bathukamma : మొదటి రోజు బతుకమ్మ ఆడుతారు. ఆ బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. కానీ చాలా మందికి ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు అంటారో తెలియదు. మొదటి రోజు బతుకమ్మ ఆడటానికి ఒక రోజు ముందుగానే మహిళలు నచ్చిన పూలను చెట్ల నుంచి సేకరించుకుంటారు.
వాటిని నీటిలో వేసి, మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఆ విదంగా బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ విదంగా ఎనిమిది రోజులు చిన్న బతుకమ్మలతో మహిళలు ఆనందంగా ఆడుతారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు. తొమ్మిదో రోజు పోయిరా బతుకమ్మ అంటూ సమీపంలో ఉన్న చెరువులు, వాగుల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మను రకరకాల పూలతో పేరుస్తారు. తంగేడు, గుణక, బంతి, చేమంతి, గుమ్మడి, కనకాంబరం, గన్నేరు, తీగమల్లే, సీతమ్మ పూలతో బతుకమ్మ పేరుస్తారు. బతుకమ్మ పైన పసుపుతో గౌరమ్మ చేసి పెడుతారు. కొన్ని ప్రాంతాల్లో ఈ గౌరమ్మను బొడ్డెమ్మ అని కూడా పిలుస్తారు.
ఇంటిలో పేర్చుకున్న బతుకమ్మకు పూజలు చేస్తారు. అనంతరం విధుల్లో పలు కుటుంబాలు కలిసి సామూహికంగా బతుకమ్మలు పెట్టి వలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. అనంతరం సమీపంలో ఉన్న చెరువు, వాగులో నిమజ్జనం చేస్తారు. దింతో బతుకమ్మ వేడుక అంటే పూల పండుగ ముగుస్తుంది.