sivaratri : మహా శివరాత్రి ఎంతో గొప్పనైన పర్వదినం. నది జలాల పుణ్యస్నానం. ఉపవాసం. జాగరణ, శివపార్వతుల కళ్యాణంతో పాటు శివనామస్మరణతో శివాలయాలు సందడిగా ఉంటాయి. ప్రతి హిందూ కుటుంబం కూడా ఇంటిలో ఉపవాసంతో జాగరణ చేస్తారు. భక్తితో శివుణ్ణి కొలుస్తారు. మరుసటి రోజు ఉపవాస దీక్ష తో శివరాత్రి పండుగ ముగుస్తుంది. ఆ రోజు పూజ కోసం వివిధ రకాల వస్తువులను, పూలు, పండ్లు ఉపయోగిస్తారు.
శివుని పూజ చేయడానికి వస్తువులను ఉపయోగిస్తాం. పూజలో భాగంగా పాలు, తేనె, శర్కర పదార్థాలను పోయడానికి వస్తువులను వాడుతారు. తేనె, శర్కర పోయడానికి ఎలాంటి వస్తువులనైనా వాడుకోవచ్చు. కానీ పాలను పోయడానికి మాత్రం రాగి పాత్రలను వాడరాదు. రాగి పాత్రలో పాలు పోసుకొని, ఆ పాత్రతో శివుడికి అభిషేకం చేస్తే ఫలితం ఉండదని వేదం పండితులు చెబుతన్నారు.
స్వచ్చమైన పాలను మట్టి పాత్రలో గాని, ఇత్తడి, అల్యూమినియం, స్టీల్ పాత్రల్లో కానీ పోసుకొని శివుడికి అభిషేకం చేస్తే ఫలితం ఉంటుందని వేదం పండితులు చెబుతున్నారు.