Green Bangles : మహిళలు చేతికి ధరించే మట్టి గాజులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువుల పద్దతి ప్రకారం ప్రతి మహిళ జాగులు వేసుకోవడం సంప్రదాయం. రెండు చేతులకు ఖచ్చితంగా గాజులు వేసుకోవడం హిందూ మహిళల సంప్రదాయం. నిత్యం రెండు చేతులు గాజులతో ఉండటం వలన మహిళలు సమస్యలకు దూరంగా ఉంటారు. భార్య, భర్త ల మధ్య అనురాగం, ప్రేమ, బంధం బలోపేతంకు దోహదం చేస్తాయి. అందుకే మహిళలు ఆకుపచ్చని గాజులనే ఎక్కువగా వేసుకోడానికి మక్కువ చూపుతారని వేదం చెబుతోంది. శాస్త్ర ప్రకారం పచ్చని గాజులు ధరిస్తే మహిళలకు శుభం కలుగుతుందని వేదంలో ఉంది. కానీ అన్ని రంగుల కంటే ఆకుపచ్చని రంగు గాజులే అందంగా కనిపిస్తాయి. అందుకే మహిళలు ఎక్కువగా కంగన్ హాల్ కు వెలితో ముందుగా ఆకుపచ్చని గాజులవైపే దృష్టి సారిస్తారు.
ఆకుపచ్చని గాజులు ధరించడం వలన సంసార భాదలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అంతే కాదు మహిళల్లో వ్యతిరేకత భావాలు పోయి, అనుకూలతమైన ఆలోచనలు పెరుగుతాయి. బుధ గ్రహానికి ఆకుపచ్చ రంగు చెందుతుంది. దింతో బుధ గ్రాహం అనుకూలించి మనోబలం మహిళల్లో పెరుగుతుంది. సుఖ, సంతోషాలను పెంచుతుంది. అపజయానికి అవకాశం ఇవ్వవు ఆకుపచ్చని గాజులు.పార్వతీ, పరమేశ్వరుల ఆశీర్వాదం ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఎల్లవేళలా మహిళలు ఆరోగ్యంతో ఉంటారని శాస్త్రంలో చెబుతోంది.