Meals : సాధారణంగా భోజనం చేసేటప్పుడు ఎటువైపు కూర్చొని తింటున్నాం అనే విషయాన్నీ చాలా మంది పట్టించుకోరు. హోటల్ లో అయితే ఆ ఒక్క సమయం కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. కానీ మన ఇంటిలో భోజనం చేస్తున్నాం కాబట్టి. వాస్తు ప్రకారం పద్ధతులు పాటించాల్సిందేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర దిక్కు కూర్చొని భోజనం చేయడం చాలా మంచిది. విజయానికి సంకేతం అవుతుంది. సిరిసంపదలకు నిలయం అవుతుంది. తెలివితేటలకు పెంపొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్ఞానానికి సంబంధించిన దిక్కుగా పరిగణిస్తారు.
తూర్పు దిక్కున భోజనం చేయడం వలన జీర్ణవ్యవస్థ బలంగా తయారవుతుంది. వృద్ధులకు, రోగులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడుకు మంచిది.
పడమర దిక్కు కూర్చొని భోజనం చేయడం వలన పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఈ దిక్కు వ్యాపారం, పని, రచన, పరిశోధన, విద్య రంగంలో ఉన్న వారికి చాలా శుభప్రదమైన దిక్కు.
దక్షణం దిక్కు కూర్చొని అస్సలే భోజనం చేయరాదు. ఇది యమధర్మరాజు కు చెందిన దిశ. పేదరికానికి దారితీస్తుంది. కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి. ప్రతికూల శక్తి వస్తుంది.