Home » Singareni : కొత్త గనులతోనే సింగరేణి అభివృద్ధి

Singareni : కొత్త గనులతోనే సింగరేణి అభివృద్ధి

Singareni : సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలంటే కొత్త గనులతోనే సాధ్యమవుతుందని SCWU-AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. శనివారం ఆయన మందమర్రి ఏరియా లోని కాసిపేట-1 గని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పలు సింగరేణి గనులు మూతపడే అవకాశం ఉందన్నారు. కొత్త గనులు ఏర్పడితేనే సింగరేణిలో ఉద్యోగ నియామకాలు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు.

కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఎప్పుడు కూడా రాజీపడదన్నారు. హక్కుల కోసం పోరాడే సంఘం ఏఐటీయూసీ ఒక్కటేనన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని హక్కులను సాధించి తీరుతామన్నారు. నూతన కొత్త గనులు సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఇంచార్జ్ చిప్ప. నరసయ్య, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం.మల్లేష్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బియ్యల. వెంకటస్వామి, పిట్ సెక్రెటరీ గొల్ల శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ బొద్దుల వెంకటేష్, నరసయ్య, వర్క్ మైన్ ఇన్స్పెక్టర్లు సుభాష్ చంద్రబోస్, రాజ్ కుమార్, పిట్ కమిటీ సభ్యులు కేతాన్, కొమురయ్య, ఖాన్, నర్సిరెడ్డి, తిరుపతి, అంజి, శివ, సాగర్, వినయ్ కుమార్ మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు..

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *